కాఫీలు,కూల్ డ్రింక్ లు,సాఫ్ట్ డ్రింక్ లు తాగటం వల్ల పళ్ళ పై మచ్చలు ,లేదా రంగు మారటం కనిపిస్తుంది. స్ట్రాబెర్రీ లేదా స్ట్రా బెర్రీ టూత్ పేస్ట్ తో పళ్ళు రుద్దుకొంటే తెల్లని మెరుపు వస్తుంది.అలాగే అరటి పండు తోక్కలో ఉండే పొటాషియం,మెగ్నిషియం ,మాంగనీస్ వంటి ఖనిజల వల్ల ఆ తోక్కతో పళ్ళురుద్దితే దంతాలు తళతళా మెరుస్తాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ బేకింగ్ సోడాతో కలిపిన లిక్విడ్ పేస్ట్ వల్ల కూడా లాభం ఉంటుంది. తులసి ఆకులు ,కమలా పండు తోక్కలు ఎండబెట్టి పొడి చేసి ఆ పొడితో రుద్దుకుంటే దుర్వాసన ,పళ్ళపై మరకలు ఏవీ ఉండవు .పళ్ళు ఆరోగ్యంగా మెరిసిపోతూ ఉంటాయి.

Leave a comment