మేకప్ వేసుకునేటప్పుడు ఉన్న శ్రద్ద దానిని తొలగించేటప్పుడు చూపించకపోవడం వల్ల చర్మానికి కళ్ళకు ఎంతో ప్రమాదకరం. ఐ షాడో కళ్ళ అందం ఎక్కువ చేసే మాట వాస్తవం. దాన్ని రోజంతా అలా ఉంచేసి రాత్రివేళ సరిగ్గా తుడిచేయకపోతే కళ్ళకు ఇన్ ఫెక్షన్ రావటం ఖాయం. అలాగే మొహం పై మేకప్ తుడిచేయకపోతే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగానే చర్మం పై ముడతలు వస్తాయి. దీనివల్ల వయసు కనబడుతుంది కూడా. లిప్ స్టిక్ తొలగించకపోతే పెదవులు పొడిబరిపోయి పగుళ్ళు చూపెడతాయి. అందువల్ల ఎంత మేకప్ వేసుకున్న సరే ఇంటికి రాగానే పాలల్లో దూది ముంచి శుభ్రంగా మొహం అంతా తుడిచేయాలి.

Leave a comment