గుజరాత్ లోని నగర పాలక సంస్థ ఆన్ ఫోన్ -ఇ -రిక్షా అనే కార్యక్రమం రూపొందించింది . వాడేసిన శానిటరీ నాప్ కిన్లు ,డైపర్లు సేకరించి వాటిని కాల్చి వేసేందుకు మున్సిపల్ సిబ్బంది ఇళ్ళకు వెళతారు ప్యాడ్లు ,డైపర్లు ఓ యంత్రం ద్వారా కాల్చేస్తారు . నలభై మంది స్త్రీ లు ఈ పనిలో ఉన్నారు . ఇరవై ఐదు ప్యాడ్లు కాల్చేస్తే రెండు గ్రాముల బూడిద వస్తుంది . ఈ మహిళలకు 7000 రూపాయిల వరకు జీతం ఉంటుంది . వార్డుకు ఇద్దరు చొప్పున పని చేస్తారు . ఈ వాడేసిన ప్యాడ్ల సేకరణ కార్యక్రమం వందశాతం విజయవంతం అయిందంటున్నారు అధికారులు .

Leave a comment