టీనేజ్ పిల్లలున్న ఇంట్లో ఎప్పుదు వాదనలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు ఎందుకిలా ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకు అర్ధంకాదు. అయితే ఈ దూకుడు ప్రవర్తనకు కారణం హార్మోన్స్ అంటున్నారు పరిశోధకులు.  యుక్తవయసులో మెదడు భాగాల్లో పెద్ద మార్పులు వస్తాయని ఎమోషనల్ కేంద్రాల కంటే రీజనింగ్ వైఖరి నెమ్మదిగా ఎదుగుతుందని చెబుతున్నారు.  టీనేజర్స్ లో ఎమోషనల్ దృక్పదం తారా స్థాయిలో ఉంటుంది.   14,15 సంవత్సరాల పిల్లలు ఇంట్లో రెట్టించి వాదన పెంచుతున్నప్పుడు పెద్దవాళ్ళు సర్దుకుపోతేనే మంచిది అంటున్నారు.  మానసిక పరిపక్వత సరిగ్గా రాని పిల్లల్లో అపరాధ భావన ఏర్పడుతుందని నెమ్మదిగా వారు వాదనలు ఆపేస్తారంటున్నారు.

Leave a comment