తొమ్మిది  దేశాలలో ఎన్నో సంస్కృతులు ,రకరకాల ఆహార అలవాట్లు ,వైద్యవిధానాల  వారితో 22 అధ్యయనాలు సుదీర్ఘమైన పరిశోధన చేసి  ఈ ముఖ్యమైన విషయం  చెపుతున్నారు అధ్యయనకారులు. ఎప్పుడూ డాక్టర్ ను మార్చకూడదు .ఆ ఒకే డాక్టర్ కు తన దగ్గరకు ఎప్పుడూ వచ్చే రోగి గురించి సమగ్రమైన  రిపోర్టు తెలుస్తుంది.ఆ సమాచారంతో రోగి తీసుకొనే ఆహారం ,అలవాట్లు అతని కుటుంబ నేపథ్యం అన్ని తెలిసి ఉంటాయి. కనుక అనారోగ్యాన్ని వెంటనే పసిగట్టగలుగుతారు. వెంటనే మంచి మందులు ఇవ్వగలుతారు. అందుకే పదే పదే లేని పోని అనుమానాలతో రకరకాల వైద్యులను కలుసుకోవటం వల్ల నష్టమే ఎక్కువ అంటున్నారు అధ్యయనాలు.

Leave a comment