రంగు అంగులా రాళ్లను బంగారంతో కలిపి నగలు చేస్తే మెరుస్తూ అందంగా ఉంటాయి. కానీ రాళ్లకు బంగారు నగల్లో పొదిగినట్లు  కాకుండా లేదా బంగారంతో చేసిన నగరంగా కాకుండా ఒకదాని పక్కన ఒకటి పేర్చి అతికించినట్లు కనిపించేలా చేస్తే ఇంకెంత మెరుపులతో ప్రకాశిస్తాయి. నగలకోసం వాడిన లోహం అంటే బంగారం లేదా ప్లాటినం అస్సలు కనిపించకుండా రాయిపక్కన రాయిచేర్చినట్లుగా ఒక్క వజ్రాల నగల్లో కనిపిస్తుంది. అవి ఖరీదు ఎక్కువ అందరికీ అందుబాటులో ఉండవు. అందుకే వజ్రాలను పోలివుండే చౌక రకం రాక్ క్రిస్టల్స్ గాజు రాళ్లతో దొరికే సిట్రాన్ ఏజెడ్ బ్లడ్ స్టోన్ జన్ఫర్ లాంటివి పెరిడాట్ అపిటైట్ టూపాజ్ వంటి రత్నాలు కలిపి ఏ లోహం కనిపించకుండా రాయి పక్కన రాయి కనిపించేలా చక్కని అందమైన నగలు రూపొందిస్తున్నారు. వీటిని పేస్ట్ జ్యూవెలరీ అంటారు. అలా  ఒక్క రాయిని అతికించి చేసేందుకు చాలా సమయం పడుతుంది. మొత్తం మీద అడుగున ఉన్న లోహం పెద్దగా కనిపించకుండా మూడు వైపులా రాయి మొత్తం కనిపించేలా చేయటం ఈ పేస్ట్ జ్యూవెలరీ గొప్పతనం బంగారు నగలకు బదులు వన్ గ్రామ్  గోల్డ్ ప్లేటెడ్ ఎలాగో ఖరీదైన వజ్రాలూ  రత్నాల నగలకు ఇవి నా కళ్ళన్నమాట.

Leave a comment