చాకోలెట్స్ ఇష్టపడని పిల్లలుండరు.వాళ్లని ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాల చాక్లెట్లు మార్కెట్లోకి వచ్చాయి. వజ్రాలు, రాళ్లు, రత్నాలు వంటి చాక్లెట్లు, బీచ్ లో దొరికే నున్నటి  రాళ్లు బొగ్గు  ముక్కలు.మంచి ముత్యాలు ఒకటేమిటి సమస్త వస్తువుల రూపంలో చాక్లెట్స్ లో వచ్చేశాయి.కోవా ,పాలు, పంచదార, సోయా, వినీల ఫ్లేవర్లు,తినే జిగురు, ఎడిబుల్ రంగులు వాడి ఈ చాక్లెట్స్ తయారు చేస్తున్నారు.  కేక్ ల పైన అలంకారంగా ఈ చాక్లెట్స్ చాలా చక్కగా ఉన్నాయి.ముత్యాలు,వజ్రాలు అలంకరించిన కేకులని  చూస్తే అవి చాకోలెట్ ముత్యాలు అనుకునేందుకు అవకాశం లేనంత సహజంగా ఉన్నాయి. ఇవి తయారు చేసేందుకు వీడియోలు ఉన్నాయి ఇంట్లోనే చక్కగా ఇవన్నీ చేసుకోవచ్చు

Leave a comment