వక్కలను అదృష్టానికి ప్రతీకలు అంటారు ఇంటికి వచ్చిన అతిథులు వెళ్లిపోయే సమయంలో వారికి ఆకులు వక్కలతో తాంబూలం ఇచ్చి సాగనంపడం అతిధి మర్యాద గా భావిస్తారు. వక్కల్లో  ఎన్నో సుగుణాలు ఉన్నాయి కొన్ని ఆయుర్వేద మందుల్లో వీటిని ఉపయోగిస్తారు. వీటిలో ని ఎరికోలిన్ అనే పదార్థం మెదడును ప్రభావితం చేస్తోంది. ఆల్కహాల్ కెఫిన్ తరువాత మానసిక ప్రేరేపిత పదార్థంగా వీటిని చెబుతారు. అందుకే వక్క పొడితినే అలవాటున్న వారు దీన్ని తొందరగా మరిచిపోలేరు.గుండె జబ్బుతో బాధపడే వారికి దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కొంతవరకు మేలు చేస్తాయి.స్కిజోఫెనియా  నుంచి విముక్తి పొందటానికి వక్కలు పనిచేస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి వక్కల్లో పోషకాలు మాత్రం ఎక్కువే.

Leave a comment