సరిగ్గా నిద్ర లేకున్న కంటి కింద వలయాలు వస్తాయి.ఒత్తిడీ,ఎలర్జీ కారణమూ కావచ్చు .ఈ సమస్య పోవాలంటే ఏదో ఒక నూనెలో కంటి చుట్టు మర్ధన చేయాలి. నిద్ర పోయే ముందర మాయిశ్చరైజర్ రాసుకొని అండర్ ఐస్ క్రీం పూత వేసుకోవాలి రసాయనాలు వద్దనుకొంటే బంగాళదుంపల గుజ్జులో నిమ్మరసం,గులాబీ నీళ్లు చేర్చీ కళ్ళకింద పూతలా వేయాలి. ఓ గంట ఆగి కడిగేస్తే చాలు.గ్రీన్ టీ బ్యాగ్లు ఫ్రీజ్ లో ఉంచి ఆ చల్లని బ్యాగ్ లను కళ్ళపైన ఉంచుకోవచ్చు .పచ్చికొబ్బరి ,కీరాగుజ్జు చేసి నిమ్మ రసం కలిపి రాసినా ఫలితం ఉంటుంది.ఇవన్నీ ప్రతి రోజు చేస్తే చాలా తోందరలో కళ్ళు మెరుపు తో ఉంటాయి వలయాలు పోతాయి.

Leave a comment