నిమ్మకాయలు వాడుతూనే వున్నాం. ఎప్పుడూ కోశాక ఒక్క అరముక్క మిగిలిపోతూ వుంటుంది. దాన్ని అలా వదిలేయకుండా బూట్లలో పడేయండి. దుర్వాసన రాకుండా వుంటుంది. బీట్ రూట్, స్ట్రాబెర్రీలు, నేరేడు వంటివి చేతులకి మరకలు అంటే లా చేస్తాయి. ఈ మరకలు పోయేందుకు నిమ్మచాక్క రుద్దాలి. ఒక బంగాళ దుంప పేస్టులా చేసి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం సహజంగా బ్లీచ్ అవుతుంది. టేబుల్ స్పూన్ పసుపు, కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ పాదాలకు రాసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు పగుళ్ళు తగ్గుతాయి. ఆర చెక్క నిమ్మరసం పెరుగు మొఖానికి రాసి 20 నిమిషాలు ఆగి కడిగేస్తే మొటిమలు రాకుండా ఉంటాయి. ఎక్స్ ట్రావర్జిన్ ఆయిల్. ఈ తరహా ఆలివ్ ఆయిల్ లో వున్న మోనో అసాచ్యురేటెడ్ కొవ్వులో హానికరమైన కొలెస్ట్రోల్ తగ్గిస్తాయి. రైస్ బ్రాడ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ కూడా మంచివే.
Categories