పిల్లల్లో ఐక్యు ఒకే రకంగా ఎందుకు వుండటం లేదు, దీనికి జీన్స్ కారణమా, ఇంకేమైన ఉంటాయా అని పరిశోధనలు చేసారు. గ్రూపులో ఏడాది నుంచి రెండేళ్ళ పిల్లలు. ఈ పిల్లల్లో కొందరికీ ఐక్యు విపరీతంగా పెరగడం గమనించారట. కారణం వింటేనే ఆశ్చర్యం. ఈ పిల్లల తల్లులు పిల్లల తో చాలా సేపు మాట్లాడటం, వాళ్ళకు మంచి కధలు చెప్పడం వాళ్ళ చేత మాట్లాడటం చేసే వాళ్ళలో ఐక్యు పెరుగుతూ వుందని తేలింది. కధలు వినిపిస్తూ వుంటే వాళ్ళలో ఊహాశక్తి, ఆలోచన పరిధి పెరగడం కధల్లో వచ్చే సంతోషం, విచారం, ధైర్యం వంటి వాటికి పిల్లలు స్పందించడం గమనించారట పరిశోధకులు. పిల్లల పరిధి ఆ సమయంలో ఇల్లు ఉయ్యాల తల్లి ఓదే అప్పుడు తల్లి చెప్పే కబుర్ల తో నే పిల్లల్లో ఉహించే గుణం పెరిగిమ్కాదని పరిశోధన చెప్పుతుంది. చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్.

Leave a comment