పిల్లలు ఆరోగ్య కరమైన ఆహారానికి అలవాటు పడాలి అనుకొంటే వాళ్ళని  వంటగదిలోకి రానివ్వండి,వంటలో భాగస్వామ్యం కల్పించండి లేదా టి.వి ల్లో వచ్చే కుకింగ్ షో చూపించండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్  . ఇలా చేయటం వల్ల పిల్లలకు తిండి పట్ల ఆసక్తి కలగటం తో పాటు పోషక పదార్దాలు తినటం అలవాటౌతుంది అంటున్నారు . ఒక పరిశోధనలో ఆన్ లైన్ సర్వే లో వందల మంది పిల్లలు తాము టి.వి ల్లో వంటల కార్యక్రమాలు చూస్తామని,ఆపిల్ ,కీరా వంటి పండ్లు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరిక ఈ కార్యక్రమాలు చూశాకే కలిగిందని చెప్పారు . తల్లితో పాటు వంటగది లో కాలక్షేపంచేసే పిల్లలు కూడా పోషక పదార్దాలు ఇష్టంగా తింటారని ఈ సర్వే తేల్చింది .

Leave a comment