ఒక్కో సారి చూస్తుంటే వంటిల్లు మించిన ‘బ్యూటీషియన్’ ఇంకెవరు లేరనిపిస్తుంది. ఆయుర్వడంలో చర్మం సహజ సిద్దమైన మెరుపు పోకుండా వుండాలి అంటే వంటింటి వస్తువులనే ప్రస్తావించాలి. అల్లంలో యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా వుంటుంది. మొహం పైన మచ్చలు, చారలు పోతాయి స్కిన్ టాన్ పోగొడుతుంది. ట్యాన్ తీసేస్తుంది. ఒక్క స్పూన్ చప్పున అల్లంరసం, నిమ్మ రసం, రోజ్ వాటర్ కలిపి ముఖ చర్మాన్ని ఈ మిశ్రమంతో నెమ్మదిగా రుద్దేసి, చెక్కని నీళ్ళతో కడుక్కోవాలి. అలాగే మిరియాలు పిగ్మెంటేషన్ పోగొడతాయి. మిరియాల పొడిలో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి రాసుకోని ఐదు నిమిషాల్లోపె కడిగేయాలి. ఒక స్పూన్ జాజి కాయ పొడిలో హోల్ మిల్క్ కలిపి పేస్టు లా చేసి కాసేపయ్యాక గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి. అలాగే దాల్చిన చెక్క కూడా మొటిమల సమస్య పరిష్కరిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనె, మెంతుల పొడి కలిపి మొహానికి రాసి ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి. దాల్చిన చెక్క పొడి, ఓట్స్, పాలు కలిపి ఫేస్ స్క్రబ్ లాగా చేసి వాడుకుంటే మొహం మెరుపు తో వుంటుంది.
Categories