టూ ఇన్ వన్ కట్టర్ గనుక వంటగదిలో ఉంటే వంట నిమిషాల్లో సిద్దం చేయవచ్చు. కట్టర్ ఫుడ్ చాపర్ కలిసి ఉంటాయి. నిమిషాల్లో అతివేగంగా పండ్లు,కూరగాయలు,ఆకు కూరలు కత్తిరించిపెడుతుంది. ఇది మన చేత్తో చేయగలిగిన పని కనుక కావలిసిన సైజ్ లో పరిమాణంలో కట్ చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్ లో కొంచెం గా సూప్ చేసుకోవాలన్న అందులోకి కావలిసిన పదార్ధాలు చాలా చిన్నగా ఒకే సైజ్ లో కట్ చేసి వేసుకోవచ్చు. కడిగేయటం చాలా ఈజీ. వంట పని కాస్త త్వరగా ముగించాలనుకుంటే వంట గదిలో ఇలాంటి వస్తువులు వుంటే బావుంటుంది.

Leave a comment