కేవలం వంటల గురించే వంద పుస్తకాలు రాశారు తర్ల దలాల్. అవి కోటి కాపీలు అమ్ముడుపోయాయి.1956 లో డిగ్రీ పూర్తిచేసిన తర్ల దలాల్ నళిన్ దలాల్ ను పెళ్ళాడి  అమెరికా వెళ్ళింది. భోజన ప్రియుడైన నళిన్ కొత్త వంటకాలు అడిగేవాడు. ఫర్ ఫెక్షన్ వచ్చేదాకా ఎన్నోసార్లు ఒకే వంటను చేశారామె. 1966 లో ముంబై తిరిగి వచ్చి వంటల క్లాస్ తీసుకునేవారు. 1974లో ప్లెజెర్స్ వెజిటేరియన్ కుకింగ్ తర్ల కు మంచి పేరు తెచ్చింది. 1987 నాటికి సొంతంగా ఆఫీస్ పెట్టుకొని తను రాసిన పుస్తకాలు అనేక భాషల్లో పబ్లిష్ అయ్యేలా సిబ్బందిని పెట్టుకుంది. 100 బుక్స్ రాసి చరిత్ర సృష్టించిందామె. ఆమె వండినవి వెజిటేరియన్ వంటలే. 1988లో ఆమె తర్ల దలాల్ డాట్ కామ్ వెబ్ సైట్ తెరిస్తే నెలకు మూడు లక్షల మంది దాన్ని చూశారు. 2007 లో ఆమెకు పద్మశ్రీ లభించింది. త్వరలో ఆమె పేరుతో సినిమా వస్తోంది.

Leave a comment