శరీరానికి కష్ట కదలిక ఉండాల్సిందే. ఏ సీజన్ అయినా వ్యాయామం చేయవలసిందే. వర్షంలో బద్దకించి చలికి చిరాకేసి వ్యాయామం పక్కన పెడితే నష్టమే. అయితే ఎవరికి వాళ్ళు చేసే వ్యాయామాలు కాస్త కష్టం అనిపిస్తే ఎక్కువ మంది తో కలిసి చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్. తాజా పరిశోధనలో వ్యాయామం నలుగురితో కలిసి చేస్తే వత్తిడి తగ్గిపోతుంది. ఒంటరిగా కంటే గ్రూప్ గా కలిసి పని చేసినప్పుడు మానసికంగా, శారీరకంగా భావోద్వేగ పరంగా మెరుగైన పరిస్థితులు  ఉంటాయని పరిశోధనల సారాంశం. అందుకే సరైన డ్రెస్ కోడ్, మంచి వాకింగ్ షూ, చుట్టూ పచ్చని వాతావరణంలో ఇష్టమైన స్నేహితులతో కానీ లేదా గ్రూప్ గా కొంత మంది తో కలిసి గానీ వ్యాయామం చేయమంటున్నారు.

Leave a comment