వంటిల్లే చిన్నపాటి ఔషదాలకు నిలయం. చిన్ని చిన్ని అనారోగ్యాలకు వంటింట్లోనే మందులు దొరుకుతాయి. చిన్న అల్లం ముక్క వేడి చేసి ఉప్పు అద్ది పరగడుపునే నమలాలి. ఇలా తింటే జీర్ణకోశ సంబంధిత అనారోగ్యాలు రావు. గొంతు ఇన్ ఫెక్షన్లు రావు, నిమ్మ రసంలో ఉప్పు కలిపి అల్లం ముక్కలు నానాబెట్టి ఒక వారం బాగా ఉంచాక ఎండబెట్టి వాటిని నిల్వచేసుకోవచ్చు. ప్రతిరోజు ఒకటో రెండో ముక్కలు చప్పరిస్తే జీర్ణక్రియ ఇబ్బందులు పోతాయి. అలగే కరివేపాకు రసం డయాబెటీస్ ను తగ్గిస్తుంది. యాలకులు పాల మీగడలో కలిపి ఆ ముద్దని చప్పరిస్తే నాలుక దవడ పూత తగ్గుతుంది. ఇది మధుమేహన్ని కూడా అదుపులో ఉంచుతుంది.

Leave a comment