కాశ్మీరీఎనామిల్ పెయింటింగ్ కుక్ వేర్ ఇమేజస్ చూసారా? వంటింటి పాత్రల పైన కాశ్మీరీ కళాకారులు చేత్తో అద్దిన అద్భుత మైన ఆకట్టుకునే డిజైన్ ల తో డబ్బాలు, గ్లాసులు, పోపుల పెట్టి,  వంటి స్టీల్ పాత్రలు వచ్చాయి. కాశ్మీరీ హస్తకళను పాత్రల పైన అద్దడం వీటి ప్రత్యేకత. టిఫిన్ బాక్స్ లు, టీ కేటిల్స్,  బౌల్స్, ఆకట్టుకునే రూపంలో వున్నాయి. పెద్దపెద్ద  సూపర్ మార్కెట్స్ లో కూడా ఇప్పుడివి కనిపిస్తున్నాయి. హస్త కళ ఇలా వంటింటికి చేరడం వంటింటి అందం రెట్టింపు చేసింది. శుభకార్యాలకు బహుమతులుగాను. రిటర్న్ గిఫ్ట్స్ గాను ఇచ్చేందుకు ఇవి చాలా బాగుంటాయి. స్టీల్ డబ్బాలకి అలవాటు పడ్డ వాళ్ళకి ఈ సరికొత్త డిజైనింగ్ వంట పాత్రలు సృజనాత్మకం గా కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు. నవతరం లో, పడక గదుల్ని, గెస్ట్ రూముల్ని, డ్రాయింగ్ రూముల్ని అందంగా అందంగా అలంకరించుకున్నట్లే ఇప్పుడు వంటగదిని అలంకరించుకోవచ్చు

Leave a comment