“మహా గణపతిం మనసా స్మరామి.
వశిష్ఠ వామ దేవాది వందిత”
వర సిద్ధి వినాయకుడు మన ప్రసాదం ఆస్వాదించడానికి వచ్చేశాడండోయ్!!
రండి మరి ముందుగా స్వామికి పూజ చేస్తూ ప్రసాదంలోకి వెళదాం. సిద్ధి వినాయకుడికి అడిగిన వారికి వరాలు ఇవ్వడమే తెలుసు.నిర్మలమైన మనసు వాడు,తల్లి మాట జవదాటడు. తండ్రి పెట్టిన పరిక్ష అయిన తన సోదరుడు కుమారస్వామిని అందుకో లేక తన తల్లి తండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి అగ్ర స్థానంలో ఉన్నాడు.ఏ పూజ చేసినా ముందుగా వరాల తండ్రికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే!!ఆహ్వానించాల్సిందే!!
వినాయకుడు దగ్గర గుంజీలు తీయటం తెలిసిన విషయమే.మనం చేసిన తప్పులుని క్షమించి వరాలు ప్రసాదిస్తాడు.
ఇష్టమైన రంగుల: తెలుపు,కమలాపండు రంగు
ఇష్టమైన పూలు:తెల్ల గన్నేరు,నిత్య మల్లె,
ఇష్టమైన పూజ:గరిక తో పూజ ప్రీతకరం
నిత్య ప్రసాదం: కొబ్బరి,అన్ని రకాల పండ్లు, పానకం,వడపప్పు.
పానకం తయారీ: నీళ్ళలో బెల్లం వేసి నానబెట్టాలి. కరిగిన తరువాత జల్లెడతో వడగట్టాలి.
వడపప్పు తయారి:పెసర పప్పు కడిగి నీళ్ళలో అరగంట నానబెట్టి,వడగట్టాలి.రెడీ!!
-తోలేటి వెంకట శిరీష