ఈ రోజే వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం మహాలక్ష్మీకి ఇష్టమైన మాసం. ఆమెకు ఈ మాసంలో పూజలు చేసి ప్రసాదాలు వివేదనం చేస్తారు. సంతానం ,సంపద ,విద్య అధిక గౌరవం ఇలా ఏది కోరినా వరలక్ష్మీ దేవి అనుగ్రహస్తుందని ఒక నమ్మకం. వరప్రదాయిని అయినా లక్ష్మీ దేవి విశ్వజనని. ధనానికి అధి దేవత,ధనంతో పాటు ధైర్యం ,శౌర్యం ,విద్య ,వివేకం ,సంతానం, ధాన్యం ప్రసాధించే అష్టలక్ష్మీ .ఆ శ్రీలక్ష్మీ దేవిని శ్రావణ శుక్రవారం నాడు పూజించటం హిందూ సంప్రదాయం . ఎవరైతే అసులు,అహాంకారం,ద్వేషం లేకుండా ప్రశాంతచిత్తంతో ఆ దేవిని కొలుస్తారో వారికి వరలక్ష్మీ దేవి అనుగ్రహాం ప్రాప్తిస్తుంది.

Leave a comment