ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం వారణాసిలో ఉంది. ఇది భారత దేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా ఈ విశ్వనాథుని సేవించి ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. కాశీ నగరాన్ని సాక్షాత్తు పరమ శివుడే నిర్మించాడని కథనం. అష్టాదశ శక్తి పీఠాలలో కూడా కాశీ ఒకటి. అది గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించారంటారు. మహాశివ రాత్రి నాడు శివుడి ఊరేగింపు జరుగుతుంది.

Leave a comment