శివాని రాజశేఖర్ తన మొదటి సినిమా టూ స్టేట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డాక్టర్ రాజశేఖర్, జీవిత కూతురు ఈమె. కీ బోర్డు, గిటార్, వీణలు చక్కగా నేర్చుకుంది. నటన అంటే ఎంతో ఇష్టం ఫిలిం మేకింగ్ కోర్సు చేసింది. హింది హిట్ చిత్రం టూస్టేట్స్ రీ మేక్ లో తెలుగులో అడవి శేషు హీరోగా రాబోతుంది. శివాని విష్ణుతో కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేస్తుంది. ఇటు తెలుగు, తమిళంలో ఒకే సారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది శివాని. ముందు చదువు పూర్తి చేసుకుని తర్వాత సినిమాలు చేయమని తండ్రి రాజశేఖర్ ఇచ్చిన సలహాతో తన సినిమాలు ప్లాన్ చేసుకుంది శివాని. వెండితెరను ఏలిన రాజశేఖర్,జీవితల ముద్దుల బిడ్డ శివానికి సక్సెస్ ఫుల్ కెరీర్ ఉంటుందని విమర్శకులు, ప్రేక్షకుల ఉమ్మడి అభిప్రాయం.

Leave a comment