కుర్తీలు ప్రత్యేకంగా కనిపించాలంటే స్టేట్ మెంట్ స్లీవ్స్ ఎంచుకోవాలి అంటారు ఎక్సపర్ట్స్. ఈ స్టేట్ మెంట్ స్లీవ్స్ లో పఫ్డ్ స్లీవ్స్ కాస్త బొద్దుగా బుట్టబొమ్మలా గా కనిపించేలా చేస్తాయి. షిఫాన్ స్పన్ మెటీరియల్ ఈ పఫ్డ్ స్లీవ్స్ కు బాగుంటాయి. అంబ్రెల్లా స్టైల్ ఎలాంటి సాధారణ కుర్తీకైనా చక్కని లుక్ ఇస్తుంది. అలాగే భుజాల నుంచి కిందకు వదులుగా ఉండి మణికట్టు దగ్గర పట్టేసినట్లు ఉండే బిషప్ స్టైల్ చాలా మోడరన్ గా ఉంటుంది. గౌన్లు,కుర్తీలు క్రాప్ టాప్ లు కూడా ఈ స్టైల్ లో బాగుంటాయి.

Leave a comment