Categories
వంద చదరపు కిలోమీటర్ల మేరకు ఉప్పు నీరు తో విస్తరించిన మగడి సరస్సు దక్షిణ కెన్యాలో ఉంది ఇందులోని ఉప్పు నీరు లోని రసాయనాలు రంగురంగుల కాంతులతో మెరుస్తాయి. సూర్యకాంతి పడితే చాలు ఈ వర్ణాలు మరింత అందంగా మెరిసి పోతూ కనువిందు చేస్తాయి. సరస్సు లోని ఉప్పు కొన్ని చోట్ల 40 మీటర్ల మందంతో ఉంటుంది. వర్షపాతం చాలా తక్కువ కురిసిన మంచినీరు నిమిషాల్లో ఆవిరైపోతుంది. మిగిలిన కాలం అంతా ఉప్పు తో తో నిండి చిత్తడి నేల గా ఉంటుంది.ఈ ఉప్పు నీటి లోని జీవులను తినేందుకు ఫ్లెమింగో లతో సహా ఎన్నో రకాల పక్షులు బారులు తీరుతాయి. ఈ పక్షి సమూహాలు గాలిలో ఎగురుతూ సరస్సు వెలుగుల్లో మరింత అందంగా ఉంటాయి.