‘సేవ్ ది గర్ల్ ఛైల్డ్’ పేరుతో మహా రాష్ట్రలోని నతారా కు చెందిన వర్షా దేశ్ పాండే ఆడ పిల్లల ప్రాణాలు కాపాడుతున్నారు లేక్ లడ్ కీ  అభిమాన ఉద్యమం పేరుతో స్టింగ్ ఆపరేషన్లు చేపట్టి గర్భ విచ్చిత్తికి పాల్పడే వైద్య కేంద్రాలను మూయించారు. 2011 లో మహారాష్ట్రలో బీడ్ జిల్లా లో ఆడపిల్లల నిష్పత్తి 807 కు పడిపోయింది.పరీక్షలు చేసి ఆడపిల్లని నిర్ధారణ కాగానే అబార్షన్ లు జరిగేవి.ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయే ఆడపిల్లలను జీవించేలా చేసేందుకు పెద్ద ఉద్యమం నడిపించారు వర్షా.వృత్తిగతంగా ఆమె లాయర్. ప్రవృత్తి పరంగా సామాజిక కార్యకర్త మహిళల కోసం వర్షా ఎన్నో సామాజిక పోరాటాలు చేశారు. విమెన్ వెల్ఫేర్ సొసైటీ ఉచిత న్యాయ సలహా కేంద్రాల ద్వారా వేల కుటుంబాలు ఆమె సాయం పొందాయి.

Leave a comment