వర్షాలు మొదలవుతున్నాయి అందుకు తగ్గట్టు ఇల్లు సిద్ధం చేయాలి. గోడలు,కిటికీలు, పైకప్పులు లీకేజీలు ఏవైనా ఉంటే ఇప్పుడే బాగు చేయించాలి. ఇంటి బయట గోడలకు వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ వేయించుకోవాలి. ఇంటి చుట్టూ గుంటలు పూడ్చి చేయాలి. విద్యుత్ వైర్లు అన్ని టెస్ట్ చేసుకోవాలి. ఇక ఇంట్లో ఇరుగ్గా కనిపించే పాత సామాన్లు ముఖ్యంగా బయట పడేయాలి. ఇల్లు మూలల్లో సామాను నిండి కీటకాలు చేరుతాయి. ఎక్కువ దోమలుండే ఏరియాల్లో దోమతెరలు తెచ్చుకోవాలి. సాధారణంగా చెక్క బీరువాలు చెక్క తో చేసిన టేబుల్  సొరుగుల్లో ఉంచుకొన్న డాక్యుమెంట్లు, దస్తావేజులు పొడిగా ఉండే సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టుకోవాలి. శుభ్రమైన నీటి గురించి పరిశీలన అవసరం వీలైతే కాచి చల్లార్చిన నీరే వాడుకోవాలి. ఒక రైన్ కోట్, గొడుగు వంటివి కూడా అవసరం కోసం ఇంట్లో ఉంచుకోవాలి.

Leave a comment