పరుగు, నడక ఎప్పుడు మంచి వ్యాయామమె కానీ ఈ వర్షాల్లో ఉదయాన్నే వర్షం పట్టుకున్నా, లేదా వర్షం కురుస్తూనే వున్నా వ్యాయామం పక్కన పెట్టాలి. అందుకే సైక్లింగ్ ఎంచుకోమంటున్నారు ఎక్స్ పార్ట్స్ పైగా సైక్లింగ్ వల్ల కొత్త లాభాలు కుడా వున్నాయంటున్నారు. వారంలో మూడు సార్లు సైక్లింగ్ చేస్తే మెదడు ఆలోచనా శక్తి పెరుగుతుంది. ప్రతి రోజు చేస్తే శరీరంలో కొవ్వు పెరుకోదు. సైక్లింగ్ గుండె సంబందిత అనారొగ్యాలు డయాబెటీస్ ను నివారిస్తుంది. టీనేజర్లకయితే వారంలో మూడు నుంచి ఐదు రోజులు, కార్డియో వాస్కులార్ వ్యాయామాలు చేయాలి. సైక్లింగ్ మానసిక శక్తిని ఇనుమడింపజేస్తుంది. పాజిటివ్ మూడ్ ఏర్పరుస్తుంది. సైక్లింగ్ వల్ల కొత్త ఎనర్జీ రావడం ఖాయం.

Leave a comment