వర్షం బావుంటుంది వెండి తీగలు సాగినట్లు వర్షం పడుతుందంటే తిన్నగా ఆ వానలో నడిచి పోవాలనిపిస్తుంది. మరి తడిసిపోతాం కదా. అలాగే ఈ వర్షాకాలం ఏ క్షణంలో మన పనులు షాపింగ్ లు ఆగవు కదా. మరి రెండు చేతుల్లోను లగేజీతో ఏ షాప్ లో నుంచి అయినా బయటకు వచ్చి  ఆగి వున్న  కారు దాకా పోయే లోగానే మొత్తం తుడిసి పోతాం. మరి అలాంటప్పుడు ఉపయోగ పడుతుంది బ్యాక్ ప్యాక్ అంబరిల్లా. దీన్ని చేత్తో పట్టుకోనక్కరలేదు. వెనక తగిలించుకొంటే చాలు. హాయిగా రెండు చేతుల్లోనూ సరుకులు, వస్తువులు పెట్టుకుని నడిచి పోవచ్చు.   నో ప్రాబ్లం. బ్యాక్ ప్యాక్ అంబరిల్లా ఎంచక్కా  నెత్తి పైన విచ్చుకుని చుక్క  నీళ్ళు పడనివ్వదు.

Leave a comment