ఈ వర్షాల సీజన్ లో శోంఠిపొడి వాడకం చాలా మంచిది. వర్షంలో తడవటం వల్ల వచ్చే జలుబు ,జ్వరాలకు ఇది మందు వంటిదే .నీళ్ళలో శొంఠిపొడి వేసి మరగనిచ్చి అందులో తాటి బెల్లం కలిపి తాగితే ఎంతో తేలిగ్గా ఉంటుంది. శొంఠి పొడి బెల్లం కలిపి తిన్న ప్రయోజనం ఉంటుంది. అల్లం ఎండబెట్టి ఈ శొంఠి పొడి తయారు చేస్తారు. వేడి వేడి అన్నంలో శొంఠి పొడి నువ్వుల నూనె కలిపి ప్రతి రోజు మొదటి ముద్దగా తింటే జీర్ణ శక్తి బావుంటుంది. మజ్జిగ లో శొంఠి పొడి ,నిమ్మరసం ఉప్పు కలిపి తాగితే ఏ సీజన్ లో అయినా మంచిదే.

Leave a comment