సెంట్రల్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్ధ చేసిన తాజా అధ్యాయినంలో, పిల్లలకు పసి తనంలోనే వేసే టీకాలు కాక, బాల్యం దాటాక వేయాల్సిన మెనంజైటిస్, హెచ్.పి.వి వంటి ఇతర టీకాలను వేయడం లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేస్తున్నారని తేలింది. పుట్టగానే వేసే టీకాలని ఆసుపత్రిలో వేసేస్తారు. ఇక పెరిగాక వేయవలసిన టీకాలని దఫాల వారీగా వేయించాల్సి వుంది. అయితే ఒక టీకా వేయిస్తారు. తర్వాత వేయవలసిన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా వేస్తే పిల్లలకు ఎంతో నష్టమని సరైన ప్రచారం లేకపోవడం వల్ల తల్లిదండ్రులకు ఈ వరుస టీకాల విషయం తెలియడం లేదని అధ్యాయినం చెప్పుతుంది. కౌమార్ వేయించాల్సిన మనం జైటిస్, హెచ్ బిఎ టీకాలు తప్పని సరిగా వేయించాలని అధ్యాయినాలు హెచ్చరిస్తున్నాయి.

Leave a comment