కొన్ని పరిశోధనా ఫలితాలు జర్నల్స్ లో చదువుతూ వుంటే నమ్మాలో వద్దో, నమ్మితే నష్టమా, పట్టించుకోక పొతే లాభము అర్ధం కాదు. ఇప్పుడు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధన రిపోర్ట్ ప్రచురించారు. ఈ రిపోర్టు ప్రకారం ఆహార పదార్ధాలు ఎక్కువ సేపు వాసన చుసినా సరే వాళ్ళు బరువు పెరుగుతుంది అని చెప్పుతున్నారు. అధిక బరువుకు కారణం అధికంగా తినడం అనుకుంటున్నాము. డాక్టర్స్ చెప్పుతున్న లాజిక్ బాగానే వుంది. మరెప్పుడు వాసన చుస్తే కుడా బరువు పెరగటం ఖాయం అంటే ఇంకేం చేస్తాం. పోనీ ఎందుకొచ్చింది కొన్ని నూనె తో నో నేతి తోనో చేసిన స్వీట్లు, ఆహార పదార్ధాలు ఎలాగు తినడం వల్ల నష్టం. తినప్పుడు ఉత్తి పుణ్యానికి వాటిని వాసన చూడటం ఎందుకు దండగ.

Leave a comment