శరీరం పైన సుగంధ పరిమళాలు వెదజల్లటం సంగతి ఎలా వున్నా డియోడరెంట్ ల తయ్యారీల్లో ఉపయోగించే రసాయినాల వల్ల అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ డియోడరెంట్స్ ఎక్కువ బాహుమూలల్లో ఉపయోగిస్తాం కనుక ఇవి రొమ్ము కణజాతులపై ప్రభావం చూపిస్తాయి, తర్వాత కాన్సర్ వచ్చె ప్రమాదం ఉంటుందంటున్నారు. ఈ రసాయినాల వల్ల చర్మం పై తేమ పోయి దురద రాషేస్ కుడా వచ్చే ప్రమాదం వుంటుంది అంటున్నారు. ఈ డియోడరెంట్ వాడకం, సాయంతరం ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసి ఈ ప్రభావాన్ని తగ్గించుకొండి అని చెప్పుతున్నారు. ఏ క్రీములు, సబ్బులు, సౌందర్య పోషకాలయినా వీటిలో వాసనా కోసమో రంగు కోసమో లేదా ఈ రెండు కొంత సేపటి వరకు నిలిచి వుండటం కోసమో రసాయినాలు వాడక తప్పదు కనుక, జాగ్రత్త సుమండీ అని హెచ్చరిస్తున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment