Categories
ప్రసవ సమయంలో ఎదురయ్యే అనేక సమస్యలకు వయసు ప్రధాన కారణమని చెన్నయ్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఒబెస్ట్ట్రిస్ట్ ,కస్తూర్బా గాంధీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం రిపోర్ట్ వెల్లడించింది. కస్తూర్భా గాంధీ హాస్పిటల్ వైద్యం కోసం వచ్చిన 3480 మంది గర్భిణీల్లో 35 దాటిన 250 మంది హై రిస్క్ మెటర్నల్ మెడిసన్ తీసుకున్నట్లు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో 30 నుంచి 35 ఏళ్ల మధ్యనే మహిళలు తొలిసారిగా గర్భం దాల్చుతున్నారని జీవితంలో స్థిరపడటం కోసం పిల్లలు కనటాన్ని వాయిదా వేసుకుంటున్నారని రిపోర్ట్ చెప్తోంది. అయితే 35 దాటినా తర్వాత గర్భం వచ్చే అవకాశాలు తగ్గుతాయని అంతేగాకుండా జీవన శైలి పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.