Categories
ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ వృద్ధాప్య ఛాయాల్ని అడ్డుకుంటుంది అంటున్నారు ఫ్రాన్స్ లోని ప్యారిస్ సిటీ యూనివర్సిటీ పరిశోధకులు రోజులో పగటిపూట మాత్రమే తిని ఆ తర్వాత ఏమి తినకుండా ఉండటమే ఈ పద్ధతి.ఇది బరువు తగ్గిస్తుంది. దీనివల్ల శరీర కణాలు తమని తాము ప్రక్షాళన చేసుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. డయాబెటిస్, గుండె జబ్బులు కాన్సర్ వంటివి కూడా ఈ ఆహార పద్ధతి అడ్డుకోగలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అన్ని రకాలా మంచిదని చెబుతున్నారు.