ఇంట్లోనూ,ఆఫీస్ లో ఈ ఎండ వేళ ఎ.సి ఆన్ చేసే విషయంలో పెద్ద వాళ్ళతో సమస్య వస్తుంది. పెద్దవాళ్ళు అంత వేడిని ,చల్లదనాన్ని ఓర్చుకోలేమంటారు. ఒక వయసు దాటాక ఉష్ణోగ్రతకు సులువుగా గురవుతారు. కాస్త వేడికి ,చలికి కూడా అసాధారణంగా రియాక్టు అవుతుంటారు. పెద్దవాళ్ళంతా ఇంతే అని నిర్ణయానికి రావద్దు . చిన్న వాళ్ళకంటే టెంపరేచర్ల ప్రభావానికి ఎక్కువ గురవుతుంటారు. వయస్సు వినికిడిని, దృష్టిని, రుచిని, వాసనను, స్పర్శను ప్రభావితం చేస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ సమస్య కేవలం మానసికమైనది కూడా కావచ్చు ఇంత చలిని వేడిని భరించలేమని మనసులో గట్టిగా నిర్ణయించుకోవడం వల్ల కూడా సమస్య రావచ్చు.

Leave a comment