Categories
పిల్లల వయసుని బట్టి వాళ్ళకి సరి పోను లంచ్ బాక్స్ లు వాటర్ బాటిల్స్ కొని ఇవ్వండి అంటున్నారు ఎక్సపర్ట్స్ .వాళ్ళు చదివే క్లాస్,స్కూల్లో ఉండవలసిన గంటలు వాళ్ళ వయసు దృష్టిలో వుంచుకోవాలి . స్కూల్లోపిల్లలు గడిపే సమయానికి అనువుగా మంచి నీళ్ళ సీసా వుండాలి . నీళ్ళు చాలీచాలకుండా ఇవ్వకూడదు. అలాగే సీసా ఆకృతి వాళ్ళ వయసుకి వాళ్ళు తేలిగ్గా మోయగలిగేదిగా ఉండాలి. ప్లాస్టిక్ సీసాలు బాక్స్ లు మరిచిపోవాలి. స్టెయిన్ లెస్ స్టీల్ సరైన ఎంపిక వేడి పదార్దాలు,నీరు ఉంచేందుకు ఇవి అనువైనవి. సురక్షితం కూడా . పాత్రల మెటీరియల్ ఆహార పదార్దాలకు రియాక్ట్ అవకూడదు . పదార్దాలు తాజాగా వుండేలా చూడాలి ఎక్కువ బరువు లేనివిగా ఎంచితే మంచిది బాక్స్ మూత తేలిగ్గా తీసే మాదిరిగా ఉండాలి.