వయసుని గెలిచిన మనిషి ప్రపంచంలో ఓల్డెస్ట్ యోగా టీచర్ 99 ఏళ్ళ  టావో పోర్షన్ లించ్  ఏళ్ళ వయసు . ప్రపంచంలో ఏదీ అసాధ్యమైనది కాదు. ఇదే ఈమె ఫిలాసఫీ మోడల్ గా జీవితం మొదలుపెట్టింది. 25 ఏళ్ళ వయసులో యూరప్ లో అత్యంత పోడుగు కాళ్ళున్న సుందరిగా గుర్తింపు పొందింది. హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. డైరక్షన్, నటన ,రచన అన్నింటిలోనూ చురుకుగా ఉంది. ఒక ప్రమాదంలో గాయపడ్డాకా ఆమె డాన్స్ చేసేందుకు కుదరదు అన్నారు. కానీ ఇన్నేళ్ళుగా శరీరాన్నీ అత్యద్భుతంగా కంట్రోల్ లోకి తీసుకోని యోగా టీచర్ గా పని చేస్తునే ఉంది. నూరవ ఏట అడుగు పెట్టబోతుంది ఈమె. ఈ అమెరికన్ యోగా మాష్టర్ మన అరబిందో ,మహార్షి మహేష్ యోగి మొదలైన వాళ్ళతో ఇండియాలోనే యోగా అభ్యసించింది. వయసుకి కాలనికి చెందదని ఈమెకు పేరు .

Leave a comment