ఈ సీజన్ కు సరిపోయే వింటర్ వేర్ ని డిజైనర్స్ మార్కెట్ లోకి తెచ్చేసారు. చక్కని రంగులు డిజైన్ లతో మామూలు కుర్తీలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రింట్ కట్ టాప్ లతో పాటు స్ట్రెయిట్ కట్ కుర్తీలు, కోట్ మొడళ్ళతో ఉలెన్ కుర్తీలు మార్కెట్ లోకి వచ్చేసాయి. బ్లాక్ ప్రింట్, ఎంబ్రాయిడరీ, జరీ, పాచ్ వర్క్ డిజైనర్ ప్రింట్ల తో ఈ ఉలెన్ కుర్తీలను స్వెట్టర్ల కన్నా సన్నని ఊలు తో రూపొందించారు. అన్ని టాప్ లకు ఫుల్ హాండ్స్. ఎన్నో బ్రాండెడ్ సంస్ధలు వీటిని తయారు చేస్తున్నాయి స్వెట్టర్ లాగే వెచ్చదనం ఇచ్చే ఈ కుర్తీలు ఫ్యాషనబుల్ గా స్టయిల్ గా ఉన్నాయి.

Leave a comment