సాధరణంగా పగటి వేడుకల కోసం బంగారు నగలు ధరిస్తేనే బావుంటుంది. రాత్రి వేళ మెరిసే జాతి రాళ్ళు పాల్కి, కుందన, మోజనైట్స్, వజ్రాల నగలు కళ్ళకు మిరుమిట్లు గొలుపుతాయి. అమ్మాయిల అందం రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా చిన్ని వేడుకల కోసం వేసుకునే సంప్రదాయ నగల్లో పోల్కీ నక్లెస్ లు, కాసుల పేర్లు అందంగా ఉంటాయి. ఇప్పటి ట్రెండ్ కైతే రాంపరీ వరాల మాల, మరీ భారీ నగలు బావుండవు కానీ మిడిల్ లెంగ్త్ హారంతో పాటు మాంగ్ టీకా, చెంప స్వరాలు, ముక్కు పుడకలు ఆడంబరంగా ఉంటాయి.  ఏ ఫంక్షన్ కోసమైన సంప్రదాయనగలే అందం గానీ వాటికి కాస్త ఆధినికత జోడిస్తే అమ్మాయిలు ప్రత్యేకంగా కనిపిస్తారు.

 

Leave a comment