ఉదయం లేవగానే ఏం చేస్తున్నారంటే దాదాపు అందరు కప్పు కాఫీ అనేస్తారు. లేదా టీ, ప్రతి ఉదయం కాఫీ తోనే మొదలెట్టొద్దు. కాసిని గోరు వెచ్చని నీళ్ళు తాగండి. లెక్క లేనన్ని ఫలితాలుంటాయి అంటున్నాయి అధ్యాయినాలు. శరీరంలోని ఖనిజ లవణాలను, ఎలక్ట్రోలైట్లను గోరు వెచ్చని నీరు సామన్మయ పరుస్తుంది. మలబద్దకం పోగొడుతుంది. అంతే గానీ శారీరకమైన నొప్పులకు ఇది తక్షణ ఉపసమనం. చక్కని మెరుపు తో కూడిన చర్మం సొంతం అవుతుంది. అలాగే గోరు వెచ్చని నీటి లో కొద్దిగా తేనె నిమ్మరసం కలుపుకుంటే ఇంకెంతో మేలు. జీవ క్రియలు చురుకుగా అవుతాయి. బరువు నియంత్రణ లో వుంటుంది. సులభంగా బరువు తగ్గి చక్కని మెరిసే చర్మం కావాలంటే ఈ తేనె, నిమ్మరసం వేడి నీరు కలిపి వుదయాన్న్నే తాగడం మంచిది.

Leave a comment