ఈ మధ్య కాలంలో యూత్ పుట్టిన రోజులు పార్టీలు అన్న ధీమ్ బేస్డ్ గానే వున్నాయి. ఎదో ఒక రంగు, ఒకే లాంటి డ్రెస్ రైట్రో స్టయిల్ అలా వుంటాయి కనుక పార్టీ డ్రెస్ గురించి ఆలోచన అక్కర్లేదు. అలా కాకుండా ఏ పార్టీకు వేళ్ళవలసి వస్తే అసిమెట్రికల్, వలజోల వంటివి చాలా బాగుంటాయి.వీటికి జతగా చెక్కని హీల్స్, ఆక్సిడైజ్డ్ నగలు, డబుల్ పెరల్ స్టుడ్స్, మ్యాటి ఫినిషింగ్ క్లోత్ లు వుంటే చాలు. డ్రెస్ లుఎంచుకునే ముందుగా శరీరాకృతి గురించి కూడా అలోచించాలి. సన్నగా వుంటే సన్నని ప్రింటు ఎంచుకుంటే బాగుంటుంది. తెల్లగా వున్న వాళ్ళు ఎరుపు, నీలం, గులాబీల్లో ముదురు రంగులు ఎంచుకోవాలి. అసలు తెల్లగా వున్నా, సాధారణ ఛాయతో వున్నా ఎవరికైనా సరే కాషాయం,గులబీ, ఎరుపు రంగులు చెక్కగా వుంటాయి.

Leave a comment