Categories
WoW

వెదురు పరదాల అందమే అందం

చైనా , వియత్నాం వంటి దేశాల్లో సన్నటి పొడవాటి వెదురు పుల్లలతో చేసిన కర్టెన్ల పైన అందమైన పెయింటింగ్స్ వేయడం అక్కడి కళాకారులకు చేతనైన విద్య. ఈ వెదురు పూసల బొమ్మలు అంత తెలికేమీ కాదు. వదిలిపోయే ఒకే వైపుగా కలిపి పట్టుకుని ప్రతి పూసనూ జారిపోనివ్వకుండా బూమలు వేయాలి. ఈ కర్టెన్ల పైన గీసిన బొమ్మ రెండు వైపులా కనిపిస్తుంది.  ఆన్లైన్ పుణ్యమా అని ఈ వెదురు పరదా చిత్రాలు మనకీ అందుబాటులో కొచ్చాయి. ఇవీ మరీ ట్రాన్సపరెంట్ గా ఉండవు. వీటిని పార్టిషన్స్ గా కూడా వాడుకోవచ్చు. ఈ కర్టెన్లలలో 90 నుంచి 140 పూసల వరసులుంటాయి. ఎంత ఎక్కువగా ఉంటే వాటి పైన వేసిన చిత్రానికి అంత అందం వస్తుంది. అందుకే ఎక్కువ వరసలు ఉండి వెడల్పుగా ఉండేవి కొనుక్కోవాలి. ఆన్లైన్ లో బెంబూ కర్టెన్స్ ఇమేజెస్ కోసం చూడొచ్చు.

Leave a comment