Categories
బ్యాం బూజ్ సంస్థ నిర్వాహకురాలు ఇంద్రాణి ముఖర్జీ ఇది కాంక్రీట్ కట్టడాలకు ప్రత్యామ్నాయంగా వెదురు నిర్మాణ సామాగ్రిని అందిస్తుంది.బెంగళూరు లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఇంద్రాణి పర్యావరణ ప్రేమికురాలు కాలుష్య కారక పదార్థాలు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా వెదురును ఎంచుకొని ఎన్నో పరిశోధనలు చేసి బ్యాం బూజ్ స్థాపించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ కె ఎస్ ఆర్ టి, బి ఎం టి సి సహకారంతో బస్ బాడీ బిల్డింగ్ లకు ప్రత్యామ్నాయంగా వెదురు బోర్డ్ లు ఏర్పాటు చేశారు. టి టి డి కి వెదురు పల్లకి తో సహా ఎన్నో ఉత్పత్తులు అందించారు. వెదురుతో కార్ పార్కింగ్ షెడ్లు, హోటల్లు రూఫ్ టాప్ లు కాటేజీలు నిర్మిస్తున్నారు.