ఇప్పుడు ఇంటీరియర్స్ లో ముఖ్యంగా డ్రాయింగ్ రూమ్ అలంకరణలో క్రేన్ బాస్కెట్స్ నడుస్తున్న ట్రెండ్. వెదురు బుట్టలు ఉపయోగించి ఇంటిలోకి ప్రకృతి అందాలను తీసుకువస్తున్నారు డిజైనర్స్. వెదురు పుల్లలతో ఇండోర్ ప్లాంట్ అమర్చి గోడకు చేర్చితే ఆ గోడ క్లాసీ లుక్ నే కాదు ఇంటికి వచ్చే అతిథులకు రిచ్ టేస్ట్ ను చూపెడుతుంది. సహజంగా దొరికేవి ఏవైనా ఆరోగ్యాన్ని అందాన్ని ఇనుమడింప జేస్తాయి. ఆ జాబితాలో వెదురు ఒకటి వెదురు కుర్చీలు ఉయ్యాల లే కాకుండా బుట్టలు కూడా ఇంటి అందాన్ని పెంచుతున్నాయి. చక్కని రంగులు వేసిన బుట్టలు గోడకు వేలాడదీసినా, అమర్చిన అందమే.

Leave a comment