Categories
WhatsApp

వీళ్ళు బెస్ట్ అమ్మలు, భార్యలు కూడా.

ఉద్యోగంలో అభివృద్ధి దిశగా ఉండాలనుకునే అమ్మాయిలు, మంచి తల్లులుగా, మంచి భార్యలుగా ఉంటారని ఇటీవల నిర్వహించిన ఒక సర్వే చెప్పుతుంది. ఆన్ లైన్ మ్యాచ్ మేకింగ్ బ్రాండ్ ఈ సర్వే నిర్వహించింది. కెరీర్ మైండెడ్ అమ్మాయిల సమస్యల పై జరిగిన సర్వే లో 1100 మంది తమ అభిప్రాయాలు చెప్పారు. అదేమంటే, ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన కుటుంబం పై పెట్టలేమన్నది సరికాదని ఎంతో మంది అమ్మాయిలు చెప్పారు. తమ కెరీర్ ను అర్ధం చేసుకునే మంచి భర్త దొరకడం కష్టమని అలాగే అత్త మామల సహకారం వుండటం లేదన్నారు. వ్యక్తి గత, ఉద్యోగ పరమైన బాధ్యతల నిర్వహణ లో సమతుల్యత సాధించడం సవాలుగా వుందన్నారు. అయితే తమకు వున్నా తెలివితో సామజిక స్పృహతో పిల్లలను ఇంటిని నడపడం కష్టంగా వుందన్నారు. పెళ్లి తర్వాత చాలా మంది కెరీర్ వదులుకున్నారు. కొందరు ట్రాన్స్ ఫర్ భయం తో ప్రొమోషన్ లు వదులుకున్నారు. ఎక్కువ మంది అమ్మాయిలు కుటుంబ బాధ్యతలకే ప్రాధాన్యత ఇచ్చారు.

Leave a comment