ఇల్లు చిన్నదిగా ఉన్నా పర్లేదు. ఇంటి తోట కోసం మనం వుండే చోటునే కాస్త కేటాయిస్తే ఇల్లు బావుంటుంది. మన కళ్ళకి పచ్చదనం కనిపిస్తుంది. మంచి ఆక్సిజన్ పైగా ఎర్రని పచ్చని ఆకుపచ్చ వర్ణాలతో ఇల్లు వర్ణ మిశ్రమంగా అయిపోతుంది. ఈ చలికాలంలో మన ప్రాణం వాతావరణానికి  పిటానియా ,అంధురియం , సినరేరియా ,జినియా , చామంతి , బంతి వంటివి పెంచుకునేందుకు బావుంటాయి. ఇవన్నీ వివిధ రంగుల్లో పూలు పూసే కుండీల్లో పెంచుకునే ,మొక్కలు. పోషకాలు ఎక్కువ వుండే నీళ్లు నిలవని మట్టిని తెచ్చుకోవాలి. కుండీల్ని కొని వాటిలో ఈ మట్టి నింపుకొని తెచ్చుకోవచ్చు. ఈ కాలంలో మొక్కలు నెమ్మదిగా పెరుగుతాయి. కనుక ఎండలోకి మారుస్తూ ఉండాలి. ఉదయం వేళ వీటికి నీళ్లు పోయటం మనం కాఫీ తాగేంత అలవాటుగా చేసుకోవాలి. చిన్న చిన్న మొక్కలకు మరీ నీళ్లు కూడా అవసరం ఉండదు. అనుభవంతో ఈ చక్కని పూల తోట పెంచుకోటం మనకి బాగా వస్తుంది. నీళ్లు కారి ఇల్లంతా పరుచుకోకుండా ప్లేట్లు ఉండే కుండీలు ఎంచుకుంటే మన ఇంటి తోట మీద మనకు ప్రేమలో పడిపోతాం.

Leave a comment