ఇష్టమైన ప్రతిదాన్ని మనసుకు దగ్గరగా తీసుకుంటాం. చాలా అతిగా ఓన్ చేసుకోవాలని చూస్తాం. మానవ సహజం. ఇప్పుడు టెక్నాలజీని కూడా ఇంతే వదల్లేనంతగా … వాట్సాప్, ఫెస్ బుక్, ఈమెయిల్స్ పదే పదే చెక్ చేసుకోవటం ఇలాంటిదే. ఈ అలవాటు ఇష్టంతో చేస్తే అలవాటైనా సరే డిజిటల్ స్ట్రెస్ కు గురవుతారని చెపుతున్నాయి అధ్యయనాలు. ఫెస్ బుక్, ఇన్స్టాగ్రామ్,  ట్విట్టర్ వంటి సోషల్ వెబ్ సైట్స్ తో పాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే సినిమా న్యూస్ కోసం నెట్ వెతుకుతూనే ఉంటారు. ఇదే పరిస్థితి అన్ని దేశాల్లోనూ ఉందని నిపుణులు చెపుతున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పరిశోధన మొదలైంది. భోజనం చేసేటప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ ను పక్కనే ఉంచుకునే వాళ్ళు 80 శాతం నిద్రపోయే ముందర కూడా దాన్ని వదిలిపెట్టని వాళ్ళ శాతం కూడా తక్కవగా ఏం లేదు. 60శాతం, మంది తల్లి తండ్రులే పిల్లలకు ట్యాబ్ లు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారని రిపోర్ట్. ఏది ఎలాగైనా అతిగా వాడటం వల్ల  జరిగే ముప్పే ఎక్కువంటున్నాయి అధ్యయనాలు.

Leave a comment