షుగర్ ఉందీ అంటే ఆర్టిఫిషియల్ స్వీట్ నర్ వుంది కదా ఇంకేం ప్రాబ్లం, పైగా చక్కని రుచికరమైన స్వీట్లను కుడా సందేహం లేకుండా తినోచ్చంటారు. స్వీట్ షాపుల్లో షుగర్ ఫ్రీ స్వీట్స్ అమ్మేస్తుంటారు. కానీ పరిశోధకులు మాత్రం  ఈ కృత్రిమ తీపి పదార్ధాల వల్ల బరువు పెరిగి ఒబేసిటి బారిన పడటం తధ్యం అంటారు. బరువు పెరగకుండా వుండటంకోసం పంచదార మానేసి ఈ స్వీట్ నర్ ల వెనుక పడేవాళ్ళు ఎందఱో కానీ ఇవి అందుకు వ్యతిరేకంగా వుబకాయం తెచ్చి పెడుతుంది. పైగా వీటి వల్ల రక్త పోటు, మధుమేహం, గుండె సంబందిత వ్యాధులు వస్తాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కనుక కాస్త పంచదార తగ్గించి తినాలి కానీ ఈ స్వీట్ నర్ల జోలికి పోకండి అంటున్నారు వైద్యులు.

Leave a comment