షాంపూల్లో ఇంకొన్ని పదార్ధాలు కలిపితే జుట్టుకు మరింత అందం ఇస్తాయంటున్నారు  ఎక్సపర్ట్స్. రోజ్ వాటర్ లో షాంపూ కలిపి తల స్నానం చేస్తే మాడు దురదపోతుంది. కాస్త ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే జుట్టు ఉడటం తగ్గిపోతుంది. నిమ్మరసం కలిపితే జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది. కాస్త తేనె కలిపితే జుట్టు పొడి బారి పోకుండా తేమగా ఉంటుంది. కలబంద రసం కలిపితే వెంట్రుకలు శుభ్ర పడి తళతళా మెరుస్తాయి. జుట్టు పొడి బారి పోకుండా ఉంటుంది. తలస్నానం చేసేందుకు షాంపూను కాస్త చిన్న గిన్నెలోకి తీసుకొని వీటిలో ఏదో ఒకటి కలిపి,కాసిని నీళ్ళు కూడా కలిపి ఆ మిశ్రమం తో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా మెరిసిపోతుంది.

Leave a comment