18 సంవత్సరాల వయస్సు నుంచే విక్ రేసర్ గా కెరీర్ మొదలు పెట్టి గిన్నీస్ రికార్డు సృష్టించింది లెస్లీ. ప్రపంచంలోనే అత్యధిక వేగం తో బైక్ నడిపే లెస్లీ  పోర్టర్ ఫీల్డ్ మెరుపు తీగలా నాజుగ్గా కనిపిస్తుంది కానీ 325 కిలోమీటర్ల వేగంతో బైక్ నడప గలదు ఆమె. ప్రపంచ వ్యాపతంగా ఎక్కడ బైక్ రేస్ జరిగినా పాల్గొంటుంది లెస్లీ . ప్రతిష్టాత్మక బోనేలిల్లె 200 ఎం పీ హెచ్ క్లబ్ లో సభ్యురాలు. 2008  బైక్ రైడింగ్ లో   కింద పడి కోమాలోకి వెళ్ళిపోయింది. ఏడు పక్కటెముకలు విరిగాయి. ఊపిరి   తిత్తులు దెబ్బ తింటున్నాయి.  అయినా ఆమె బైక్ వదల లేదు. మగాళ్ళ ఆధిక్యం తో    వుండే రేసింగ్ లోకి   అమ్మాయిలను తీసుకురావడం లక్ష్యం అంటుంది లెస్లీ.

Leave a comment